సిగరెట్ తాగడం ఓ పెద్ద మాయ రోగం.. నాలాంటి వాడు దాన్ని వదిలించుకోడానికి ఇప్పటికి ఓ వంద తీర్మానాలు చేసి ఉంటాడు. సినిమా మొదలయ్యే ముందు సిగరెట్ వద్దంటూ చెప్పే న్యూస్ రీల్‌ను కళ్లార్పకుండా చూస్తాం. ఇంటర్వెల్ కాగానే గబగబా వెళ్ళి రూపాయి ఎక్కువిచ్చి మరీ కొనుక్కుంటాం. ముక్కూ ముఖం తెలియని తోటి సిగరెట్ వ్యసనగ్రస్తుడి నుంచి నిప్పును ఉదారంగా తీసుకొని బెల్ కొట్టేలోగా ఉఫ్ ఉఫ్ మని ఊదేసి హాల్లోకి పరిగెత్తుకెళ్ళి సీట్లో కూర్చొని గస పెడుతుంటాం.
ఇక డ్యూటీలో ఉన్నప్పుడైతే పెట్టె కొనుక్కుంటే ఎన్ని ఊదేస్తామో తెలియదు కాబట్టి బయటకెళ్ళి ఎదురుగా ఉన్న టీ కొట్లో "ఏక్ బడా గోల్ట్ ఫ్లేక్" అని అడిగేసి ఓ సిగిరెట్ తీసుకుంటాం. గాల్లోకి పొగ వదులుతూ చేయబోయే పని గురించి దీర్ఘాలోచనలో పడిపోతాం.
wallpaperseries.com సౌజన్యంతో
అదే చెన్నయ్‌లో ఐతే "ఒరు కింగ్ కుడప్పా'' అని అడిగినా కానీ బడ్డీకొట్టువాడు రెండు సిగరెట్లు తీసి చేతికి ఇస్తుంటాడు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఇకపై పంజాబ్‌లో నాలాంటి పొగరాయుళ్ళ పప్పులు ఉడకవనే వార్త పొద్దున్నే పేపర్లో చూశా.. అక్కడ గవర్నమెంట్ విడివిడిగా సిగిరెట్లు అమ్మడాన్ని బ్యాన్ చేసింది. ఎందుకంటే విడి సిగరెట్ మీదా ఎలాంటి పుర్రె బొమ్మలు కానీ హెచ్చరికలు కానీ ఉండవట. అందుకని జనం విచ్చలవిడిగా సిగిరెట్లు తాగేస్తున్నారట. ఆ కారణంగా సిగిరెట్ పెట్టెలు మాత్రమే అమ్మాలని అక్కడి విక్రయదారులకు ఆర్డర్ ఇచ్చింది. ఇదీ ఒకందుకు మంచిదే. పెట్టె కొనుక్కునే స్తోమత లేనివాళ్ళు మెల్లమెల్లగా దురలవాటుకు దూరమౌతారు.
కానీ చిక్కల్లా నాలాంటి వాళ్లతోనే. మరొక పొగ రాయుడితో సిగిరెట్ పెట్టెను షేర్ చేసుకుందామనే ఎంఓయూ చేసుకుంటే ఆ బ్రహ్మదేవుడు దిగొచ్చినా మా పొగరాయుళ్ళను బాగు చేయలేడు.

ఉపసంహారం హైలేట్.....!!
ReplyDeleteఇలా సూపర్ ఐడియాలు ఇచ్చే వాళ్ళు ఉన్నంత కాలం పంజాబ్ కాదుకదా ఇంకా ప్రపంచం లో స్మోకింగ్ బాన్ చేసిన 66 కంట్రీ ల వాళ్ళూ ఏమీ చేయలేరు....!!
ఫర్ రిఫరెన్స్ సి దిస్ లింక్:
http://en.rauchverbotweltweit.de/smokingbans-worldwide.php