సంక్రాంతి పండగ కోసమని ఇవాళ ఒక తమిళ టీవీ ఛానల్‌లో ఓ సినిమా వచ్చింది. దాని పేరు ''నాయ్‌గల్ జాగిరిదై''. అంటే కొన్ని ఇళ్ల గేట్లకు ఉన్న బోర్డు మీద రాసుండే 'కుక్కలున్నాయి జాగ్రత్త' అని అర్థం. ఇప్పుడంతా తెలుగులో ఎవరు పెడుతున్నారు? తెలుగులో బోర్డులు రాసేవారెక్కడున్నారు? అవును రాయడమెందుకు? 'Beware of Dogs' అని కీ బోర్డు మీద టైప్ చేసి కంప్యూటర్‌లో దాన్ని సేవ్ చేసి ప్రింటవుట్ తీసుకొని అట్ట ముక్కకు అతికించి గేటుకు తగిలించేస్తే సరిపోతుంది. పనిలోపనిగా సెర్చ్ ఇంజిన్‌లోకి వెళితే కుక్కల ఫోటోలు బోలెడు దొరుకుతాయి. వాటిలో ఒక దాన్ని తగిలిస్తే లుక్ ఇంకా బాగుంటుంది. సారీ.. సంగతి ఏటో పోయింది.
సరే ఈ ''నాయ్‌గల్ జాగిరిదై'' సినిమాలో హీరోగా.. మరి కుక్క సంగతి?.. చివర్లో చెబుతా. హీరోగా సత్యరాజ్ అని ఒకప్పటి తమిళ హీరో కొడుకు శిబిరాజ్ నటించాడు. ఈ సత్యరాజ్ మన తెలుగువాళ్లకు బాగా తెలిసినవాడే. ఒకప్పుడు చిరంజీవి 'జ్వాల'కు దీటుగా సుమన్ 'దర్జాదొంగ' వచ్చింది. ఆ దర్జాదొంగ సినిమాలో మారుతి కారులో తిరుగుతూ దర్జాగా మర్డర్లు చేసే విలన్‌గా బీభత్సంగా యాక్ట్ చేశాడు ఈ సత్యరాజ్. మనోడు సీన్‌లోకి రాగానే ఇళయరాజా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయేది.
మామూలుగా ఎవరైనా నిర్మాత తన కొడుకును హీరోగా పెట్టి సినిమా తీస్తుంటే ఆ సినిమా అంతా తన కొడుకే మీదే ఫోకస్ అవ్వాలని కోరుకుంటాడు. ముఖ్యంగా మన నిర్మాతల గురించైతే అసలు చెప్పక్కర్లేదు. అలాంటిది ఈ సత్యరాజ్ తన కొడుకు శిబిరాజ్‌కు అంతగా ఇంపార్టెన్స్ ఇవ్వకుండా సినిమా అంతా కుక్కతోనే చుట్టేశాడు. కానీ డైరక్టర్ వెంకట్ సౌందర్ రాజన్ ఈ సినిమాను ఎంత బాగా తీసాడంటే పండుగ పూట టీవీ ఛానల్స్‌లో బ్రేక్ వచ్చిందంటే యాడ్స్ కుప్పలుతెప్పలుగా వచ్చి పడతాయి. అలాంటప్పుడు వేరే ఛానల్‌కు వెళ్ళిపోతాను. కానీ ''నాయ్‌గల్ జాగిరిదై'' సినిమా కంటిన్యుటీ ఎక్కడ మిస్సవుతానో అని యాడ్స్ అన్ని భరించా.
కుక్క దాని విశ్వాసం గురించి ఎన్టీఆర్ 'ఆత్మబంధువు' ఇంకా చాలా సినిమాలు వచ్చాయి. కుక్క ఎంతో గొప్పదో మాములు వాళ్ల కంటే కూడా దాన్ని పెంచుకునే వాళ్లకి బాగా తెలుస్తుంది. అందుకే ఈ సినిమా వస్తున్నప్పుడు చూడమని ఓ ఫ్రెండ్‌కు ఫోన్ చేశా. కానీ వాడెక్కడో బజార్లో ఉన్నానని చెప్పాడు. కథ గురించి నేను చెప్పడం కాదు కానీ వీలుంటే ఈ సినిమాను చూడ్డానికి ట్రై చేయండి. కుక్కల మీద రాళ్లు వేసే వాళ్ళు, వాటిని చూస్తేనే చీదరించుకునేవారు ఏం మిస్సవుతున్నారో తెలుస్తుంది.
చివరగా విశ్వనాథుడు కొలువైన వారణాసికి క్షేత్రపాలకుడు కాలభైరవుడే...

This comment has been removed by the author.
ReplyDeleteబాగుంది...!
ReplyDeleteఇది చదువుతుంటే ఒకసారి ఆ సినిమా చూసితీరాల్సిందే అనిపిస్తోంది.
మరోవిషయం కూడా గుర్తుకొస్తోంది. దాదాపు ఓ ఎనిమిదేళ్ళ క్రితం అనుకుంటా టీవీ లో మా అన్నయ్య తో కలిసి చూసిన " Far from Home - The Adventures of Yellow Dog" అనే సినిమా కూడా గుర్తు కొచ్చింది. వీలుంటే అదికూడా చూడు చాల మంచి అనుభూతి చెందవచ్చు. పైన చెప్పినట్లు వాటిని పెంచుకున్న వాళ్ళకే వాటి గొప్పదనం తెలుస్తుంది అనేది చాల నిజం. మా నాన్నగారి వలన నాకు చిన్నతనం నుంచి ఆ అనుభూతితో ఎంతో అనుబంధం ఉంది.