మొత్తానికి నేనూ ఓ బ్లాగర్ ను అయ్యాను. సంతోషంగా ఉంది. ఒక్క భాషతోనే పనులు కానిద్దాం అంటే కాని రోజులివి. కనీసం రెండు భాషలు కలిపి కొడితేనే అవతలివాడికి మనమేం చెబుతున్నది అర్ధం కాని పరిస్థితి. అందుకే నా బ్లాగుకు తెలుగోల అనే పేరు పెట్టాను. అంటే ఓ తెలుగోడికి నాలుగు భాషలు తెలిస్తే వాడు రాసింది చదివే వారి బుర్ర ఎంత హీటెక్కిపోతుందో చెప్పడానికే ఈ పేరు.
దారిని పోయేటప్పుడు తగిలేవారు... పనీపాటా లేకుండా టీవీ ముందు కూర్చున్నప్పుడు బుర్రలో పుట్టుకుచ్చే ఐడియాలను నాలుగు రాతల్లో గీకి పారేస్తే మన పనైపోతుందనే తత్వంతో ఇందులోకి దూకా. సాధ్యమైనంతవరకు ఎవర్ని బాధ పెట్టకుండా నాకు తోచింది నాకు నచ్చినట్లుగా రాద్దామనే తపనతో ఈ దారిలోకి వచ్చాను.
ఇదంతా మాకెందుకు అదేదో పత్రికలకు పంపించవచ్చు కదా అని మీరడగవచ్చు. ఒక్కో ప్రతికది ఒక్కో ఫిలాసఫీ. ఆ ఫిలాసఫీకి తగ్గట్లుగా మన ఎమోషన్స్ ను, ఐడియాస్ ను మౌల్డ్ చేసుకుంటూ కాంప్రమైజ్ ఐపోయి పెన్నుతో అలికేసిన కాగితాలను వాటికి పంపించాలి. ఎందుకొచ్చిన తలనెప్పి అనుకొని ఇటొచ్చి పడ్డా. రోజూ ఏదోకటి రాసి దీంట్లో పడేద్దామనే ఆలోచనతో ఇందులోకి వచ్చా. ఐతే ఇక్కడో కండిషన్ ఉంది. నా రాతల గురించి మీ ఒపినియన్ ముఖం మీద ఒకటి ఇచ్చినట్లుగా ఉండాలని రిక్వెస్ట్ చేసుకుంటున్నా. ఇవాల్టికి ఇక్కడితో తెలుగోల సమాప్తం.

మొత్తానికి ఈ బ్లాగర్ లోకి ప్రవేశించి నీ భావ వ్యక్తీకరణ కు స్వేచను పొందావు.
ReplyDeleteఏ విధమైన వత్తిడులకు లోనవకుండగా ప్రశాంత చిత్తము తో మనకు తోచినది వ్రాసుకొనే స్వేఛ్చ మనకి లభించడం నిజంగా ఎంతో ఉపయోగయుక్తం గా ఉంది. ముందు ముందు ఎన్నో మంచి మంచి రచనలు అని అనడం కన్నా మంచి భావ ప్రకటనలు నిర్భయంగా చేయాలని కోరుకుంటూ - మిత్రుడు శనగవరపు రమేష్ కుమార్