3/21/2016

ఎంత బాగుండు


మండుటెండల్లో మలయమారుతం
పిండి వెన్నెల్లో పారిజాత పుష్ప పరిమళం
మసక చీకట్లో ముగ్ద మనోహర సుదతి ముఖ బింబం
సంధ్య కాలంలో గోధూళి రేగిన భానుని తిరోగమనం(ఎంత బాగుండు)
----
ఎంత బాగుండు
పుల్లలు, ఆకులతో గూడల్లుకుంటున్న పిచ్చుకల ద్వయం
ప్రాత:కాలంలో గుడి వినిపించే సుప్రభాతం
అలికిడి విన్నంతనే అమ్మను హత్తుకునే చిరు ప్రాయం
మోడువారిని చోటనే మొలుచుకొస్తున్న చిగురాటుకుల పచ్చదనం (ఎంత బాగుండు)
----
ఎంత బాగుండు
వనమో కవనమో తెలియని కవితా పూదోటలో విరిసిన నవ హృదయం
నేల రాలిన మామిడి పిందె చిగురు వగురు తీపిదనం
వడగాడ్పుల్లో తాటి ముంజెల చల్లదనం
చిరు చినుకుల తాకిడికి విచ్చుకున్న మట్టి పరిమళం (ఎంత బాగుండు)

No comments:

Post a Comment