టైటిలు అబ్బాయిగారు, వెంకటేష్, మీనా హీరోహీరోయిన్లు; కథ కె భాగ్యరాజా, డైలాగులు జంధ్యాల, డైరెక్షను ఇవివి సత్యనారాయణ.
వాట్టే కాంబినేషన్ అనుకున్నారు జనం.
ఫస్ట్ రోజు హైదరాబాద్ దేవీ థియేటర్లో మార్నింగ్ షో చూసి బైటకు రాగానే సినిమాకు మంచి టాక్.
దాన్తో పాటు ఓ సైడు టాకు. "అసలు జంధ్యాల ఏమిటి.. ఇలా డబుల్ మీనింగు డైలాగులు రాయడమేటి?" అని.
ఈ సైడు టాకు ఏ రేంజ్‌కు చేరుకుందంటే.. ఓ రోజు జంధ్యాలగారు ప్రెస్ వాళ్ళను పిలిచి "ఆ డైలాగులు నావి కావు" అని క్లారిటీ ఇచ్చేదాకా.
++ ++ ++ ++
టైటిలు భారతీయుడు, కమల్ హాసన్ డబుల్ యాక్షన్, శంకర్ డైరెక్షన్, ఎఆర్ రెహ్మాన్ మ్యూజిక్కు.
కథ అంటే కరప్షన్ మీద ఓ ఫ్రీడమ్ ఫైటర్ చేసే ఫైటు. క్లయిమాక్సులో కన్న కొడుకును ఖతం చేసేసిన పెద్ద కమల్ హాసన్ ఫ్లయిట్ ఎక్కేసి ఫారిన్ చెక్కేస్తాడు. అక్కడ్నుంచి ఇండియాలో ఎవరికో ఫోన్ చేస్తాడు. ఫోన్ ఎత్తిన వారు 'ఎవరు మాట్లాడేది' అని అడగ్గానే 'భారతీయుడు' అని పెద్ద కమల్ హాసన్ స్టయిల్‌గా చెప్తాడు. తెర కిందకు దిగుతుండగా జనం హాల్లోంచి బైటకు వచ్చేస్తారు.
సినిమా తెగ ఆడేస్తోంది. ఎక్కడ చూసినా ఆ సినిమా సంగతులే. అదే టైమ్‌లో జంధ్యాల గారు ఓ వార పత్రికలో వారం వారం పాఠకుల ప్రశ్నలకు జవాబులిస్తున్నారు. అందులో ఒకటి ఇలా ఉంది..
ప్రశ్న: 'భారతీయుడు' సినిమా గురించి మీ అభిప్రాయం?
జంధ్యాల: ఫారిన్ పారిపోయిన 'భారతీయుడు' గురించి ఏం చెప్పమంటారు?
(రైటర్, డైరెక్టర్ అండ్ యాక్టర్ జంధ్యాలగారి వర్థంతి ఈ రోజు జూన్ 19న)
---- మహేష్ ధూళిపాళ్ళ

No comments:
Post a Comment