5/23/2020

సామ్యవాది కరోనా

సరళీకృత విధానాల సమ్మోహన రాగం
ఆర్థిక సంస్కరణల గంధర్వ గానం
ప్రపంచీకరణ పదనిసల కాలం

ముచ్చటైన మూడు పదుల వయసులో
రెండు వైపులా స్వార్థపుటంచుల
పదును తేరిన లోకం
నా వసుధైక కుటుంబం

అయినా కానీ
కాలం కాని కాలంలో
రుతురాగం అపశృతిలో
పురుడు పోసుకున్న సామ్యవాది
యముని మహిషపు గంటల కరోనా

కరోనా.. ఓ కరోనా
నువ్వెన్నాళ్ళుంటావో తెలియదు కానీ
       నువ్వున్ననాళ్ళూ నాకు బోధి చెట్టువే సుమా

No comments:

Post a Comment