వెరైటీ మూవీస్ వెర్సటైల్ డైరెక్టర్, ఫొటోగ్రాఫర్ రాజీవ్ మేనన్‌కు పై పోలిక సరిగ్గా సరిపోతుంది. నిజంగా తను కమర్షియల్ సినిమా ప్రపంచంలో ఓ ఎడారి కోయిల లాంటివాడే. అందుకేనేమో AVM సంస్థ 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న వేళ 'మెరుపుకలలు' (తమిళంలో మిన్సార కణవు ) మూవీ డైరెక్ట్ చేసే ఛాన్స్ రాజీవ్‌కు దక్కింది.
అప్పట్లో ఒంగోల్లో పాన్ డబ్బా లాంటి శ్రీదేవి హాల్లో మెరుపు కలలు చూశాను. అలాంటి హాల్లోనూ పేరుకు తగ్గట్టుగానే సినిమా అంతా జిగేల్ జిగేల్‌మని మెరిసిపోయింది. అరవింద్ స్వామి, ప్రభు దేవా, అప్పటి పాపులర్ హిందీ హీరోయిన్ కజోల్ కాంబినేషన్‌లో ఓ వెరైటీ సినిమాగా నిలిచిపోయింది.
పాటలన్నీ వేటూరివే. 'ఎడారి కోయిల పెంటిని వెతికే గాంధారం' అనే భావగర్భితమైన వాక్యాన్ని ఆయన ఈ సినిమాలో 'తల్లో తామర మడిచే ఓ చిలకా' అనే పాట కోసం రాశారు. మెరుపుకలలు తెలుగువారిని మెప్పించలేకపోయింది. ఒరిజినల్ మిన్సార కణవు తమిళులకు నచ్చిందనుకుంటా.
ఆ తర్వాత మూడేళ్ళకు రాజీవ్ మేనన్ 'ప్రియురాలు పిలిచింది'(తమిళంలో కండుకొండేన్ కండుకొండేన్) అనే సినిమాతో మళ్ళీ జనం మధ్యలోకి వచ్చాడు. ఏ మాయ చేశాడో ఎలా ఒప్పించాడో తెలీదు కానీ, మమ్ముట్టి, అజిత్, అబ్బాస్, టబు, ఐశ్వర్య రాయ్ అనే అపురూపమైన కాంబినేషన్ తో సిల్వర్ స్క్రీన్‌ను ఓ కాన్వాస్‌గా మలచుకొని అందమైన ఒక పెయింటింగ్‌లా ఈ సినిమాను అందించాడు.
ఐశ్వర్య రాయ్‌తో 'పలికే గోరింకా చూడవే నా వంకా' అనే పాట నాటి నుంచి నేటి దాకా సినిమాల్లో హీరోయిన్ ఇంట్రడక్షన్‌కు ఒక రిఫరెన్సుగా మారిపోయింది.
'ప్రియురాలు పిలిచింది' కూడా తనకు నచ్చిన ధోరణిలోనే తీశాడు రాజీవ్. ఇంకా చెప్పాలంటే సినిమాలో 'ఏమాయే నా కవిత' పాటలోలా ఇంకా ఏదోదే చూపించాలనే తపన పడ్డాడు.
హైదరాబాద్ ఓడియన్ థియేటర్లో తమిళ కొలిగ్స్‌తో కలిసి చూశాను. ఈ సినిమా తెలుగువారికి అంతగా ఎక్కలేదు.
ఆ తర్వాత చాల కాలానికి మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా 'సర్వం తాళమయం' అనే సినిమాతో ఈ మధ్యనే వచ్చాడు రాజీవ్ మేనన్. స్టోరీ లైన్ మృదంగాలు తయారు చేసేవారు సైతం అదే వాయిద్యాన్ని నేర్చుకొని వాసికెక్కగలరు.
తెలుగులో సినిమా అలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది. ఆ కాస్త కాలంలోనే హైదరాబాద్‌లో చూడగలిగా. టైటిల్ సాంగ్ ఎంత అద్భుతంగా వచ్చిందంటే హీరో దేశాటనం చేస్తుంటే ఆయా ప్రాంతాల కళలు, సంస్కృతీ సంప్రదాయాలకు తగ్గట్టుగా వినసొంపైన రకరకాల తాళ వాయిద్యాలు అతడితో పాటుగా ప్రేక్షకులకు శ్రవణానందం కలిగిస్తాయి.
ఇంతకీ ఇదంతా చెప్పడానికి సందర్భం ఏమిటంటరా?
సరిగ్గా ఇరవై ఏళ్ళ క్రితం 'ప్రియురాలు పిలిచింది'.
అదండీ సంగతి. ఉంటాను.
మీ మహేష్ ధూళిపాళ్ళ

No comments:
Post a Comment