3/19/2020

వెల్ డన్ క్రైమ్ రిపోర్టర్.. కరోనాతో క్రైమ్ రేట్ తగ్గించావ్..!

కరోనా అలియాస్ కోవిడ్-19 దెబ్బకు హైదరాబాద్ సహా తెలంగాణ రాష్ట్రంలో క్రైమ్ రేట్ బాగా పడిపోయిందట. దీనికి మనమంతా సదరు అంతర్జాతీయ వైరస్‌కు ధ్యాంక్స్ చెప్పుకోవాలట. ఇదేదో జస్ట్ వన్డే బ్యాక్ జర్నలిజంలోకి ఎంటరైన ఒక జర్నలిస్టు క్రైమ్ బీట్ తీసుకొని నేను సైతం కరోనాకు అంటూ అత్యుత్సాహంతో రాసిన న్యూస్ కాదు. అలాగే ఏదో వన్ మంత్ బ్యాక్ కొత్తగా పెట్టిన న్యూస్ పేపర్ అంతకంటే కాదు. అది నేషనల్ లెవల్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించినప్పుడు దానికి నిరసనగా ఎడిటోరియల్ పేజ్‌ను బ్లాంక్‌గా ఉంచిన హిస్టరీ ఆ పేపర్‌కు ఉంది. అలాంటి పేపర్ హైదరాబాద్ ఎడిషన్ ఫ్రంట్ పేజీలో ఫోర్ కాలమ్స్‌లో వచ్చిన వార్త అది.

"Thanks to Covid, crime rate witnesses downward trend".. ఇది ఆ న్యూస్ హెడ్డింగ్.

ప్రపంచంలో యావత్ మానవాళిని కనీవినీ రీతిలో కలవరపెడుతున్న ప్రాణాంతక వ్యాధుల్లో కోవిడ్-19 ఒకటి అనడంలో ఎలాంటి సందేహం లేదు అనే లీడ్‌తో ఆ న్యూస్ మొదలవుతుంది. అయితే ఇంతటి ప్రాణాంతకమైన కరోనా వైరస్‌కు ఉన్న ఒక్కగానొక్క 'పాజిటివ్' ఎఫెక్ట్ అటు రాష్ట్రంలో ప్రజలకు ఇటు పోలీసులకు సీజనల్ క్రైమ్ నుంచి రిలీఫ్ తీసుకొచ్చిందట. అంతేకాదు రాష్ట్ర పోలీసు అధికారులు చెప్పినదాన్ని బట్టి చూస్తే గడచిన కొద్ది రోజుల్లో హైదరాబాద్ సహా మిగిలిన రాష్ట్రంలో గ్రాఫ్ పేపరు మీద క్రైమ్ రేటు నేల చూపులు చూస్తోందని ఆ వార్త సగర్వంగా చెప్పుకొచ్చింది. ఈ న్యూస్ ప్రకారం పోలీసులు ఏమంటున్నారంటే ప్రతి ఏటా ఎండాకాలం రావడం ఆలస్యం అంతర్రాష్ట గజ దొంగల ముఠాలు తెలంగాణ రాష్ట్రం మీద పడి చైన్ స్నాచింగ్‌లు, రాబరీలు విపరీతంగా చేసేస్తుంటారట. అయితే ఈసారి మాత్రం కరోనా వైరస్ కు భయపడి ఆ ముఠాలు ఈ సమ్మర్‌కు వాళ్ళ ప్లాన్స్‌ను హోల్డ్‌లో పెట్టారుట. ఆ వార్తలో ఇంకా చాలా చాలానే ఉన్నదనుకోండి.


క్రైమ్ రేట్ పడిపోవడం నిజమే అయి ఉండవచ్చు. అందుకే సదరు క్రైమ్ రిపోర్టర్‌కు పేజీలు నింపడానికి కావాల్సిన న్యూస్ దొరికి ఉండకపోవచ్చు. పైవాళ్ళ నుంచి వచ్చే ప్రెషర్ తట్టుకోలేక వన్ ఫైన్ మానింగ్ ఈ మార్వెలెస్ థాట్ వచ్చి ఉంటుంది. ఇంకేముంది. తనకున్న ఇన్‌ఫ్లుయన్స్‌తో ఒకరిద్దరు ఆఫీసర్లకు ఫోన్ చేసి కావాల్సిన సరకు పొంది ఉండొచ్చు. జస్ట్ వన్ అవర్ కంప్యూటర్ ముందు కూర్చొగానే ఫ్రంట్ పేజీకి కావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ న్యూస్ రెడీ.

కరోనా వైరస్ దెబ్బకు జనమంతా గగ్గోలుపెడుతున్నారు. రాకుండా ఉండటానికి ఎవరేం చెప్పినా, ఆఖరకు దారిన పోయే దానయ్య చెప్పినా చెయ్యడానికి రెడీ అయిపోతున్నారు. కాకరకాయ రసం నుంచి కంట్లో పెట్టుకునే కాటుక దాకా ఇలా ప్రతిదీ కరోనాకు విరుగుడు అంటూ ఎలాంటి డిగ్రీలు లేకుండానే ఆన్‌లైన్ డాక్టర్లు మాటలతో ప్రిస్క్రిప్షన్లు ఇస్తుంటే ఫాలో అయిపోతున్నారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే కోవిడ్ పుణ్యమాని క్రైమ్ రేటు తగ్గిపోతుందంటూ రాసుకొచ్చిన ఆ రిపోర్టర్‌కు శతకోటి నమస్కారాలు. పబ్లిష్ చేసిన ఎడిటర్‌కు జోహార్లు. ఎక్కడో చైనాలో పుట్టి ఇంత దూరం ట్రావెల్ చేసి వచ్చి మరీ మా పాత్రికేయ ప్రముఖులకు ఇలాంటి 'గొప్ప గొప్ప' ఐడియాలు ఇస్తున్న కరోనాకు జేజేలు. 

No comments:

Post a Comment