2/21/2020

శిఖర సమానుడు.. అక్షర బద్ధుడు

సర్వాంగ సుందరం, ప్రలోభాల ప్రపంచం.. సినీ రంగం.

అలాంటి చోట పాత్రికేయ కలానికి శిఖర సింహాసనం వేసిన జర్నలిస్టు పసుపులేటి రామారావుగారు. 

మెగాస్టార్ చిరంజీవి ఉత్థానానికి, మహానటి సావిత్రి విషాదకరమైన పతనానికి ప్రత్యక్ష సాక్షి ఆయన.

తన 70 సంవత్సరాల జీవన ప్రస్థానంలో 50 సంవత్సరాలు సినీ పాత్రికేయ వృత్తికి అంకితమైన మచ్చలేని మనిషి.

పసుపులేటి రామారావుగారికి నివాళి తెలుపుతూ మరో సీనియర్ జర్నలిస్టు రెంటాల జయదేవగారు రచించిన వ్యాసం 'అక్షర బద్ధుడు'. ఆ వ్యాసాన్ని నా Podcast channel Mixie Mahesh లో చదివి వినిపించాను. 

విని మీ అభిప్రాయం తెలియజేయవలసిందిగా మనవి. ఆడియోకు సంబంధించిన లింక్ ను దిగువ ఇస్తున్నాను. ధన్యవాదాలు.



శిఖర సమానుడు.. అక్షర బద్ధుడు

2/17/2020

అట్ల పిండి

ప్రముఖ రచయిత చలం గారి కలం నుంచి జాలువారిన అచ్చతెనుగు హాస్యకథ 'అట్ల పిండి'.

ఈ కథను నా Podcast Channel 'Mixie Mahesh' లో స్వయంగా చదివి వినిపించాను.


సంబంధిత లింక్ ను దిగువన జోడించాను.

విని మీ అభిప్రాయం తెలియజేయవలసిందిగా కోరుతున్నాను.

అట్ల పిండి ఆడియో లింక్

2/10/2020

బుర్రకథ

బుర్రకథ కళారూపం.. తెలుగు సమాజానికి ఒక సాంస్కృతిక రాయబారి. స్వాతంత్ర్యోద్యమం నుంచి పలు విప్లవోద్యమాలను జనంలోకి తీసుకువెళ్ళడంలో అన్యన్యసామాన్యమైన పాత్ర పోషించింది బుర్రకథ.



పల్నాటి యుద్ధం, బొబ్బిలి యుద్ధం, అల్లూరి సీతారామరాజు, బెంగాల్ కరవు తదితర ఇతివృత్తాలతో చదువుకున్నవారి నుంచి అక్షరమ్ముక్క రాని వారి దాకా అశేష జనవాహినిలో పెను కదలిక తీసుకువచ్చి బుర్రకథకు పితామహునిలా వాసికెక్కారు షేక్ నాజర్.

షేక్ నాజర్ జీవిత విశేషాలను నా Podcast Channel 'Mixie Mahesh' లో చదివి వినిపించాను.

సంబంధిత ఆడియో లింక్‌ను దిగువ అందిస్తున్నాను. Play button press చేయడం ద్వారా ఆడియో వినగలరు. విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని తెలియజేయవలసిందిగా మనవి చేసుకుంటున్నాను.

Burrakatha