1/23/2020

My Dear Daddy

మా భూమి చిత్రంతో ప్రముఖుడైన నటుడు, డాక్యుమెంటరీల రూపకర్త త్రిపురనేని సాయిచంద్ ఫిదా, సైరా చిత్రాలతో చాలా కాలం తర్వాత సినిమాల్లో కనిపించారు.

                                         “వీరగంధము దెచ్చినారము వీరుడెవ్వరో తెల్పుడీ అంటూ స్వాతంత్రోద్యమ కాలంలో జాతికి మేలుకొలుపు పాడిన కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరిగారు సాయిచంద్ తాతగారు.

                              మనో వైజ్ఞానిక నవల అసమర్థుని జీవయాత్ర తో తెలుగు నవలా సాహిత్యంలో ఆధునిక యుగానికి నాంది పలికిన ప్రముఖ రచయిత త్రిపురనేని గోపీ చంద్ సాయిచంద్ నాన్నగారు.


                               వారిద్దరూ నేపథ్యంగా తన జీవన యానానికి కేరాఫ్ పేరిట పుస్తక రూపమిచ్చారు సాయిచంద్. రచయిత గోపీచంద్ రచనలంటే నాకు ఒక విధమైన ఆరాధనా భావం.


                                ఈ నేపథ్యంలో ఆరేళ్ళ వయసులో తండ్రిని కోల్పోయిన సాయిచంద్.. నాన్నగారితో తన మధుర స్మృతులను కేరాఫ్ పుస్తకం ద్వారా పాఠకులతో పంచుకున్నారు.

      వాటిలో కొన్నింటిని నా Podcast Channel ‘Mixie Mahesh’ లో చదివి వినిపించాను. 

సంబంధిత లింక్ ను ఇక్కడ జోడిస్తున్నాను. విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని తెలియజేయవలసిందిగా మనవి చేసుకుంటున్నాను.

My Dear Daddy

No comments:

Post a Comment