2/12/2017

హిట్టు కొట్టాలంటే దేవుడే బెస్టు

నాగార్జున చూడండి ఎంత సేఫ్ జోన్‌లో విజయవిహారం చేస్తున్నాడో. అప్పుడెప్పుడో పీక్కుపోయిన ముఖం, మాసిపోయిన గడ్డం, నుదుట కట్టుకున్న ఎర్రటి గుడ్డ ముక్కతో 'విక్రమ్' సినిమాతో తెరంగేట్రం చేసిన హీరో ఇతనేనా అనిపిస్తుంది సినిమా కథలను ఎంపిక చేసుకోవడంలో అతడి వ్యూహం చూస్తుంటే. తండ్రి ఏఎన్నార్ సినిమా షూటింగులప్పుడు పూజా పునస్కారాలకు దూరంగా ఉండే పక్కా నాస్తికుడు. ఈయనా కొన్నాళ్ళూ తండ్రి రూట్‌లో ప్రయాణించాడు. ఆ తర్వాత అన్నమయ్యతో కొత్త రూటు పట్టాడు. అదే దేవుడ్ని క్యాష్ చేసుకోవడం. అంతకుముందు ఆయన కెరీర్ మలుపు తిప్పిన 'శివ' సినిమా పేరు కూడా దేవుడికి సంబంధించిందే కదా. అందుకే ఇప్పటికీ పాతతరపు పెద్దలు దేవుడ్ని నమ్ముకున్నవాడు ఎన్నటికీ అన్యాయమైపోడు అని అంటుంటారు.

మళ్ళీ పాయింట్ దగ్గరకు వస్తే... మొదట్లో ఆడియన్స్ లేకపోయినా ఆ తర్వాత అన్నమయ్య సూపర్ హిట్ అయ్యింది. అదే రాఘవేంద్రరావు, నాగార్జున కాంబినేషన్‌కు కొత్త ఫార్మాలాకు నాంది పలికింది. ఓ భక్తుడు, ఓ దేవుడు, ఇద్దరి మధ్య అలుకలు కోప, తాపాలు, భక్తుడు కాకముందు హీరోతో హీరోయిన్ల డ్యూయెట్లు... రియల్‌గా కుదరకపోతే డ్రీమ్ సాంగులు. క్లయిమాక్స్‌లో దేవుడితో పీక్ లెవల్లో ఆర్గ్యుమెంట్లు. కావాలంటే అన్నమయ్య నుంచి నిన్న కాక మొన్న రిలీజైన 'నమో శ్రీ వేంకటేశాయ' దాకా ఇదే వరుస కదా. నాగార్జునకు దేవుడు కచ్చితంగా హిట్ ఇస్తాడు. లేకపోతే 'సోగ్గాడే చిన్న నాయనా' సినిమాలో చివర క్లయిమాక్స్‌లో గుళ్లో ఫైటింగ్, ఆత్మ ఊగిసలాట మహా రంజుగా సాగి నాగార్జునకు సూపర్ హిట్ ఇచ్చింది. కావాలంటే చూడండి నాగార్జున నెక్ట్స్ సినిమాల్లో దేవుడికి కాస్త చోటివ్వకపోతే నన్నడగండి. అదండీ నాగార్జున కెరీర్ మళ్ళీ పట్టాల మీదకు రావడం వెనుక అసలు సిసలు రహస్యం

No comments:

Post a Comment