ఏదో తెలియని ఆనందంతో
నిదుర రాని కనులతో
అష్టావధానమవుతున్న ఆలోచనలతో
గురుతుకొచ్చింది ఓ గీతం..
"నా వాలు జడ కృష్ణవేణి
నా పూల జడ వెన్నెలా గోదారి
నా వొళ్ళు గంగమ్మ పరవళ్ళుగా
నర్తన చేసిన రతిని
కూచిపూడి భారతికి హారతిని"
ఇలా సాగే ఆ పాట 'అమెరికా అల్లుడు' అనే సినిమాలోది. ఎప్పుడో 1980ల్లో రిలీజైనప్పుడు ఒంగోల్లో చూశాను. మళ్ళీ ఆ పాటను నేను విన్నదీ లేదు.. కన్నదీ లేదు.
ఇన్నేళ్ళకు ఇప్పుడెందుకో నా జ్ఞాపకాల తేనెతుట్టె మీద ఎవరో బెల్లం ముక్క విసిరితే.. ఇలా ఝమ్మంటూ నా బుర్రలోంచి బైటకు వచ్చింది.
ఈ సినిమాలోనే గొప్ప నటీమణి సూర్యకాంతం అమెరికాలో బజ్జీలు చేసి డాలర్ బజ్జీలు డాలర్ బజ్జీలు అంటూ హాస్యం పండించే సన్నివేశం నాకిప్పటికీ గుర్తుంది.
ఇంతకీ ఈ పాట రాసిందెవరంటారా? నాకైతే ఆ పదాల అల్లికను చూస్తే వేటూరిగారనిపిస్తోంది. ఉంటాను.